మంగళవారం ఆశలు పెంచిన పొలిమేర-2 !
ఆసినిమాను అనుసరిస్తూ ఈ సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ అయిన ‘విరూపాక్ష’ మూవీ కూడ సూపర్ సక్సస్ కావడంతో సూపర్ సక్సస్ కావడంతో సగటు ప్రేక్షకులు హార్రర్ కామెడీలు అలాగే హార్రర్ సినిమాలు కన్ఫ్యూజుడు కామెడీల సినిమాల కంటే మిస్టరీ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడుతున్నారు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికి ఉదాహరణగా లేటెస్ట్ గా విడుదలైన మిష్టరీ థ్రిల్లర్ మూవీ ‘మాఊరి పొలిమేరా 2’కు కలక్షన్స్ విషయంలో వస్తున్న స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.
సత్యం రాజేష్ లాంటి క్యారెక్టర్ నటుడు లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అనూహ్యమైన రాబడుతోంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కొంతకాలం క్రితం ఓటీటీ లో విడుదలైన ‘మా ఊరి పొలిమేర’ కు సీక్వెల్ గా ‘పొలిమెరా 2’ తీశారు వాస్తవానికి ఈసినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేకపోయారు. అయితే సగటు ప్రేక్షకుడుకి ఈసినిమా బాగా నచ్చడంతో కలక్షన్స్ బాగా వస్తున్నాయి అని అంటున్నారు.
దీనితో ఈనెలలోనే విడుదలకాబోతున్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘మంగళవారం’ మూవీకి బయ్యర్ల నుండి మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ మూవీ గురించి చాలామందికి తెలియదు. లేటెస్ట్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ కూడ ఈ జోనర్ ను నమ్ముకుని ‘ఊరి పేరు భైరవకోన’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ‘నిజమే నే చెబుతున్నా’ పాటకు మంచి స్పందన రావడంతో ఈమూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆశ్చర్యం లేడు అంటున్నారు..