ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన గుంటూరు కారం ఫస్ట్ సాంగ్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ హేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై మొదటి నుంచి అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ధమ్ మసాలా అనే సాంగ్ తాజాగా విడుదలైంది.ఈ ఫస్ట్ సింగిల్ తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఇంకా భారీగా పెరుగుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ ఈ సినిమాతో కచ్చితంగా మ్యాజిక్ చేస్తారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పాట విషయానికి వస్తే రామజోగయ్యశాస్త్రి సాహిత్యం ఈ ఫస్ట్ సింగిల్ కు హైలెట్ గా నిలిచింది. 2024 ఖచ్చితంగా సంవత్సరం ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతమంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమా సాహిత్యం విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వంతు సహాయసహకారాలు అందించారని సమాచారం అందుతోంది.గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో మహేష్ బాబు అభిమానులు ఆశలు బాగా ఫలించాయనే చెప్పాలి. తాజాగా ఈ పాట 24 గంటలు పూర్తి చేసుకుంది. 24 గంటల్లో ఈ పాట రికార్డు స్థాయిలో 17.43 మిలియన్ వ్యూస్ రాబట్టింది.



తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన తెలుగు పాటగా ఈ పాట ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట తరువాత కూడా వరుసగా 3 మూడు పాటలు కేవలం మహేష్ బాబువే కావడం విశేషం. Top 5 లో Top 4 సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలే ఉన్నాయి. అంటే సూపర్ స్టార్ తన రికార్డుని తానే బద్దలు కొట్టుకొని ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తున్నారు. అంతేగాక ఈ సినిమా ఏకంగా 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రీజనల్ సినిమాల్లో టాప్ లో నిలిచింది. 2024 లో విడుదల అయ్యే సినిమాల్లో గుంటూరు కారం, దేవర, కల్కి, OG, పుష్ప 2 మెగా 156 100 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి. అందులో ఒక్క గుంటూరు కారం తప్ప అన్ని పాన్ ఇండియా సినిమాలే.దీన్ని బట్టి సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.ఇక జనవరి నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. ఆరోజు రికార్డులు బ్రేక్ కావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: