తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాగూర్ నటిస్తూ ఉండగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు మరికొన్ని రోజుల్లో ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ ను విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను ఈ నెల చివరన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటికే విజయ్ ... పరుశురామ్ కాంబోలో రూపొందిన గీత గోవిందం సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.