మరో రెండు భాషలలో భగవంత్ కేసరి మూవీ.. దబిడి దిబిడే..!!
బాలయ్య కూడా సక్సెస్ ఈవెంట్లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మంచి సందేశం యాక్షన్ కలిపిన ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ ఇలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తనకు మొదటి నుంచి ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టమే అందుకే భగవంత్ కేసరీ సినిమా అని చేశాను ఈ చిత్రాన్ని తమిళ్ మరియు హిందీ డబ్బింగ్ వర్షన్లో త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది.
ఈ మెసేజ్ దేశంలో ఉండే ప్రజలందరికీ చేరాలని ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నానని బాలయ్య తెలిపారు.. హింది వర్షన్లోని తన పాత్రకు మొదటిసారి తానే డబ్బింగ్ చెప్పానని బాలయ్య తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు తాను చెప్పిన తెలుగు భాష డబ్బింగ్ విన్నారు.. ఇకపై హింది తో మోత మోగుద్ది అంటూ తెలియజేయడం జరిగింది బాలయ్య.. తన భాష పటిమ తన సత్తా ఏంటో మీరే స్వయంగా చూడండి అంటూ తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో విలన్ గా నటించిన అర్జున్ రాంపాల్ బాలీవుడ్ నటుడు కావడం గమనార్హం. తెలుగులో ఎంత అద్భుతమైన విజయంగా నిలిచిన ఈ సినిమా మరి ఇతర భాషలలో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మరి.