సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!!
హీరోగా నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలలో ఒక వెలుగు వెలుగును చంద్రమోహన్ ఎంతోమంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే ఖచ్చితంగా వారికి తిరుగు ఉండదని భావన చాలామంది హీరోయిన్లలో ఉన్నది అలా జయసుధ జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ ఆయనతో మొదట నటించిన వారే. 1942 మే 23న కృష్ణాజిల్లాలో జన్మించడం జరిగింది చంద్రమోహన్ ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చంద్రశేఖర్ గా మార్చుకోవడం జరిగింది.
దాదాపుగా 932 కు పైగా సినిమాలలో నటించిన చంద్రమోహన్ 1966 లో రంగుల రత్నం అనే సినిమా ద్వారా మొదటిసారి తన సినీ కెరీయర్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఎన్నో చిత్రాలలో విలక్షణమైన పాత్రలో నటించి చెరగని ముద్ర వేసుకున్న చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. అందులో కూడా తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్న చంద్రమోహన్ ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలకు మంచి సక్సెస్ అందుకున్నారు. దాదాపుగా చంద్రమోహన్ టాప్ హీరోయిన్లతో కూడా నటించారు. సహజ నటనతో మెప్పించిన చంద్రమోహన్ అనారోగ్య కారణాల చేత కొద్ది రోజుల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.. కానీ ఇటీవలే తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోతున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలుపుతున్నారు.