బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాల కృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా విడుదలయి ఇప్పటికీ 20 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని బాగా సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా టెక్నీషియన్లకు సన్మానించి వారికి జ్ఞాపికలను కూడా అందచేశారు. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించడం జరిగింది. మంచి సన్నివేశం యాక్షన్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఈ సినిమాకు ఇలాంటి విజయం అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా బాలకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. నాకు మొదటి నుంచి ప్రయోగాలు చేయడం అలవాటని అందుకే ఈ భగవంత్ కేసరి సినిమాను హిందీలో ఇంకా తమిళంలో డబ్ చేసి త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సినిమాలోని మెసేజ్ దేశ ప్రజలందరికీ చేరితే మేము చేసిన ఈ ప్రయత్నం మరింత మందికి చేరువవుతుందని బాలకృష్ణ తెలియజేశారు. ఇక హిందీ వెర్షన్ లో నా పాత్రకు నేనే మొదటిసారి డబ్బింగ్ చెప్పుకున్నానని ఈ సందర్భంగా బాలయ్య తెలిపారు.. ఇప్పటి దాకా నేను చెప్పిన తెలుగు భాష డబ్బింగ్ విన్నారు. ఇక పై హిందీతో మోత మోగుద్దని కూడా అన్నారు.నా భాషా పటిమ, నా సత్తా ఏంటో మీరే స్వయంగా చూస్తారని బాలయ్య అన్నారు. ఇదిలా ఉండగా సినిమాలో విలన్ గా చేసిన అర్జున్ రాంపాల్ బాలీవుడ్ నటుడు కావడం సినిమాకు ఖచ్చితంగా అక్కడ కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తెలుగులో పెద్ద హిట్ అయిన ఈ సినిమా హిందీలో తమిళ్ లో ఎలా ఉంటుందో ఇంకా బాలయ్య ప్రయోగం ఎలా ఫలిస్తుందో చూడాలి.ఈ సినిమా దాదాపు 130 కోట్ల దాకా గ్రాస్ 70 కోట్ల దాకా షేర్ వసూళ్లు సాధించింది.