సూపర్ స్టార్ విగ్రహ ఆవిష్కరణకు మహేష్ రాకపోవడానికి కారణం....!!!
ఇంకొంతమంది అస్సలు మహేష్ బాబు ఎందుకు రాలేదు.. ? అని ఆరాలు తీస్తున్నారు ఈ విగ్రహావిష్కరణకు మహేష్ బాబుకు, ఘట్టమనేని కుటుంబానికి ఆహ్వానం అందలేదా.. ? లేక అందినా వారు రాలేకపోయారా.. ? అనే విషయం తెలియాల్సి ఉంది. మహేష్.. తాను విగ్రహావిష్కరణకు రాలేకపోయినా సోషల్ మీడియా ద్వారా అందరికి థాంక్స్ చెప్పాడు. ' విజయవాడలో కృష్ణగారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైనందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా గర్వకారణం, ఆయన వదిలి వెళ్లిన వారసత్వానికి నివాళులు. అలాగే, ఈ ఈవెంట్‌ను సాధ్యం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చాడు. నవంబర్ 15 అంటే.. కృష్ణ వర్థంతి రోజున ఘట్టమనేని కుటుంబం ఈ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తుందేమో చూడాలి.