హీరోయిన్స్ పరంగా చంద్రమోహన్ కు ఉన్న స్పెషాలిటీ అదేనా....!!
చంద్రమోహన్ సరసన సుమారు 60 మంది హీరోయిన్లు నటించారు. ఒకటి రెండు సినిమాలు చేసి సక్సెస్ కాని హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో బిజీ కావడానికి చంద్ర మోహన్ సరసన యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారని నాటి సినిమా జనాలు అనేవారు. బాలనటిగా సినిమాలు చేసిన శ్రీదేవి 'పదహారేళ్ళ వయసు' సినిమాతో కథానాయికగా మారిందనే విషయం తెలిసిందే. జయప్రద తొలి సినిమా 'సిరిసిరి మువ్వ'లో ఆయనే హీరో. జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ… ఇలా ఎంతోమందికి ఆయనే తొలి హీరో.ఇక చంద్రమోహన్ సరసన ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ జయసుధ. ఇద్దరూ 34 చిత్రాల్లో జంటగా నటించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి లాంటి కథానాయికలతో పదికిపైగా సినిమాల్లో నటించాడు చంద్రమోహన్. అయితే 'పదహారేళ్ళ వయసు' సినిమాతో తర్వాత శ్రీదేవితో కలసి నటించకపోవడం గమనార్హం.