దీపావళికి సైతం నిరాశ మిగిల్చిన చిత్రాలు..!!
భారీ అంచనాల మధ్య రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలు కూడా మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ పెద్దగా కలెక్షన్స్ పరంగా కూడా ఆకట్టుకోలేకపోవడంతో యావరేజ్ గా నిలిచింది. బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన సల్మాన్ ఖాన్ నటించిన టైగర్-3 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలై భారీ విజయాన్ని అందుకుంటుందని నమ్మకాన్ని బాలీవుడ్ ప్రేక్షకుల సైతం పెట్టుకున్నారు ఇందులో హీరోయిన్ గా కత్రినా కైఫ్ కూడా నటించడం జరిగింది.అంతేకాకుండా ఆమెకు సంబంధించి టవల్ సన్నివేశం గత కొద్దిరోజులుగా వైరల్ గా మారడంతో ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడింది.
అయితే ఇండియాలో 5500 స్క్రీన్ లలో ఓవర్సీస్ లో 3500 స్క్రీన్ లలో విడుదల అవ్వగా.. టైగర్ -3 సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలోనే సల్మాన్ ఖాన్ కెరియర్ లో చాలా తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా టైగర్-3 నిలిచింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్ట లేకపోతున్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 300 కోట్ల రూపాయలతో కలిసి విచిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రెండ్ వర్గాలు తెలుపుతున్నాయి అంతటి కలెక్షన్స్ రాబట్టే అవకాశం లేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.