హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ నిండా ఫ్లాప్లే..!!
గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాలో కూడా ఎముడు నటించిన ఇది కూడా ఫ్లాప్ గానే మిగిలింది. పవన్ కళ్యాణ్ తో నటించే అదృష్టాన్ని అందుకున్న అను ఇమ్మాన్యుయేల్ అజ్ఞాతవాసి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం అందుకుంది నా పేరు సూర్య సినిమాలో నటించిన ఇది కూడా డిజాస్టర్ గానే మిగిలింది.. నాగచైతన్యతో కలిసి శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది.
శర్వానంద్, సిద్ధార్థ కాంబినేషన్లో వచ్చిన మహాసముద్రం సినిమా కూడా అను ఇమ్మాన్యుయేల్ కు ఫ్లాపు గానే మిగిలింది... అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించగా ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది.. ఇటీవల రవితేజ నటించిన రావణాసురుడు చిత్రం కూడా డిజాస్టర్ గానే మిగిలింది. ఇటీవల కార్తి నటించిన జపాన్ సినిమాలో తన గ్లామర్ తో అందచందాలతో మైమరిపించినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ వైపుగా వెళ్తుంది. దాదాపుగా ఈమె నటించిన ఈ వరుస 9 సినిమాలు కూడా ఫెయిల్యూర్ గానే నిలిచాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి కథలతో అభిమానులను మేపిస్తుందో చూడాలి.