తమన్నా - విజయ్ వర్మ పెళ్లికి అడ్డం అదేనా..?
అయితే న్యూ ఇయర్ సందర్భంగా విజయ్ వర్మ,తమన్నా ఇద్దరు కూడా ముద్దు పెట్టుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం గురించి అప్పటినుంచి తెగ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత వీళ్లిద్దరు చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నారు. అలాగే లవ్ స్టోరీస్ -2 సినిమాలో కలిసిన నటించడం జరిగింది. ఇందులో ముద్దులు రొమాన్స్ తో రెచ్చిపోయి మరి పెళ్లి విషయాన్ని హాట్ టాపిక్ గా చేయడం జరిగింది. అయితే ఇప్పట్లో వీరి వివాహం ఉండకపోవచ్చు అన్నట్లుగా తమన్నా ఒకానొక సందర్భంలో తెలియజేసింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినట్టుగా కనిపిస్తోంది. తమన్నా తల్లిదండ్రులు సైతం పెళ్లి విషయం పైన ఆమెను ఒత్తిడి తెస్తున్నారని ముఖ్యంగా వయసు కూడా పెరిగిపోతోందని త్వరలోనే వివాహం చేసుకుంటే తమ బాధ్యత తీరిపోతుంది అన్నట్టుగా ఆమెను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమన్నా వివాహానికి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే తమన్నా విజయ్ చేతిలో ఉన్న ప్రస్తుతం సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో తమన్నా ,విజయ్ పెళ్లి ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజమో చూడాల్సి ఉంది.