రవితేజ ను వెతుక్కుంటూ వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆఫర్....!!

murali krishna
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.. వరుస గా బిగ్గెస్ట్ ఆఫర్స్ అందుకుంటున్నాడు.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వార్‌'సినిమాకు సీక్వెల్‌గా అయాన్‌ ముఖర్జీ  'వార్ 2' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది.. 'వార్ 2' సినిమా తో ఎన్టీఆర్ బాలీవుడ్‌ లో అడుగుపెడుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బాట లోనే మాస్ మహారాజా రవితేజ కూడా బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమౌతున్నారు.ఇటివలే 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా సినిమా చేశారు రవితేజ. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు రవితేజ. హిందీ వెర్షన్ కు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అయితే ఈ కష్టం వృధా పోలేదు. ఇప్పుడు రవితేజ కు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడో భారీ మల్టీస్టారర్ లో నటించే ఆఫర్ రవితేజని వెతుక్కుంటూ వచ్చింది.ఓ అగ్ర నిర్మాణ సంస్థ రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ చేయడానికి రవితేజ సుముఖం గా వున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానున్నట్లు సమాచారం.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ ఈగల్.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుక గా విడుదల అవుతుంది.ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ ఈగల్ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.అలాగే రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమౌతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.ఈ సినిమా కూడా కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిన కథాంశంతో తెరకెక్కుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: