వచ్చే సంక్రాంతికి విడుదల కాబోయే ఆ మూడు మూవీల వెస్ట్ గోదావరి హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాలు ఉండడం విశేషం. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం విడుదల కాబోయే సినిమాలలో ఓ మూడు క్రేజీ మూవీ లకు సంబంధించిన వెస్ట్ గోదావరి జిల్లా హక్కులను ఒకే డిస్ట్రిబ్యూషన్ దక్కించుకోవడం విశేషం. ఆ మూవీ లు ఏవి ..? ఆ సంస్థ ఏది అనే విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుత సైన్ధవ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఈగల్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లతో పాటు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న హనుమాన్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూడు మూవీ ల యొక్క వెస్ట్ గోదావరి థియేటర్ హక్కులను ఉషా పిక్చర్స్ బ్యానర్ వారు భారీ ధరలు ఇప్పటికే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాని వెస్ట్ గోదావరి జిల్లాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: