సలార్ కత్తిరింపుల పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న ‘సలార్’ వచ్చేనెల డిసెంబర్ 22న విడుదల కాబోతున్న పరిస్థితులలో ఈ మూవీ గురించిన వార్తలు  గాసిప్పులతో మీడియా హోరెత్తి పోతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య  ఈ మూవీకి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ప్రభాస్ అభిమానుల  మధ్య హాట్ టాపిక్ గా మారింది.



ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఒక స్పెషల్ సాంగ్ తీస్తున్నారన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హడావిడి చేస్తున్న ఈవార్తల  ప్రకారం  బాలీవుడ్ బ్యూటీ  సిమ్రత్ కౌర్ పై దర్శకుడు ప్రశాంత నీల్ ఒక ఐటమ్   సాంగ్ తీస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈబ్యూటీ నాగార్జున ‘బంగార్రాజు’ లో ఒక చిన్న పాత్రలో చేసిన విషయం తెలిసిందే.    



ఈ మూవీకి ముందు ఈమె ప్రేమతో ‘మీ కార్తీక్ పరిచయం’ ‘డర్టీ హరి’  సినిమాలు చేసినప్పటికీ అవి ఫెయిల్ అవ్వడంతో ఆమె గురించి  టాలీవుడ్ ఇండస్ట్రి పట్టించుకోలేదు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఆమె ‘సలార్’ లో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి ఒక చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈమూవీ రన్ టైమ్  ఎక్కువగా రావడంతో ఎలర్ట్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు  సంబంధించి ప్రభాస్ పృథ్విరాజ్ సుకుమారన్ ల చిన్ననాటి ఎపిసోడ్స్ ను ఈమూవీ ఫైనల్ కాపీ నుండి తొలగించి నత్తలు వార్తలు వస్తున్నాయి.    



ఈ సినిమాను చూసే ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీల్  అవ్వ కుండా ప్రశాంత్ నీల్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా  గత కొన్నిరోజులుగా ఈసినిమా మార్కెట్ కు సంబంధించి మీడియాలో  వచ్చిన రకాల గాసిప్పులకు చెక్ పెడుతూ ఈ మూవీ నిర్మాతలు రంగంలోకి దిగి తమ అంచనాలకు మించి ఈ మూవీ బిజినెస్ అయిందని ఈ సినిమా వాయిదా పడవచ్చు అన్న గాసిప్పులను ఖండించడంతో ప్రభాస్ అభిమానులు తెరిపిన పడ్డారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: