తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నందమూరి
బాలకృష్ణ ... సూపర్ స్టార్ మహేష్ బాబు ... ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ ... సిద్దు జొన్నలగడ్డ లకు సంబంధించిన సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. వారు ప్రస్తుతం ఏ సినిమాలో నటిస్తున్నారు ..? అందుకు సంబంధించిన
సినిమా షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
బాలయ్య బాబు ప్రస్తుతం
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ ను "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు "బీహెచ్ఈఎల్" లో
బాలకృష్ణ మరియు కొంత మంది పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ బృందం వారు ప్రస్తుతం
హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి
చౌదరి ...
శ్రీ లీల
హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
టాలీవుడ్
యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు
హైదరాబాద్ లో సిద్దు పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ఈ
మూవీ లో అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటిస్తోంది.