ఊహించని విలువైన బహుమతి అందుకున్న సందీప్ వంగా !
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ లతో పాటు ఈ మూవీ పాటలు అందరికీ నచ్చడంతో ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరుతుంది అన్నఅంచనాలు వస్తున్నాయి. ఈ మూవీ విడుదలై ఈ మూవీ ఫలితం తెలియకుండానే ఈ మూవీ దర్శకుడు సందీప్ వంగాకు ఈ మూవీ నిర్మాతలు ఐదు కోట్ల కారును బహుమతిగా ఇవ్వడం ఫిలిమ్ ఇండస్ట్రి వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ తో లాభాల పంట పండటంతో సందీప్ వంగా పేరు బాలీవుడ్ మీడియాలో హోరెత్తి పోతోంది. ఇప్పుడు ‘యానిమల్’ నిర్మాత భూషణ్ కుమార్ కు ‘యానిమల్’ విడుదలకు ముందే భారీ లాభాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ ను మించి బిజినెస్ జరగడంతో జోష్ లో ఉన్న ఈ మూవీ నిర్మాత సందీప్ వంగాకు ఇలాంటి అత్యంత ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.
బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఒక సినిమా విడుదల కాకుండా ఒక దర్శకుడికి మరే నిర్మాత ఇంత విలువైన బహుమతి గతంలో ఇవ్వలేదు అంటూ వార్తలు రాస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడికి ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేసే అవకాశం చిక్కడంతో రానున్న రోజులలో సందీప్ టాప్ దర్శకుల లిస్ట్ లో చేరడం ఖాయం అని అనిపిస్తోంది.