"యానిమల్" విషయంలో కూడా "అర్జున్ రెడ్డి" ని ఫాలో కానున్న సందీప్ రెడ్డి..?

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు మరియు హిందీ సినీ పరిశ్రమలలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇకపోతే ఈయన విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఈయనకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీ లో రూపొందించాడు.


ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు హిందీ లో కూడా మంచి క్రేజ్ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా "యానిమల్" అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమా యొక్క రన్ రన్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఇక మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జనాలను అద్భుతమైన రీతిలో అలరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే సందీప్ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న యానిమల్ మూవీ ని కూడా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు అది మూడు గంటల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మరి యానిమల్ మూవీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: