వాడివల్లే తను ప్రేమించిన అమ్మాయి దూరమైందట రక్షిత్ శెట్టి కామెంట్స్ ..!!

Divya
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎందుకంటే తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా రష్మికతో నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత వివాహం క్యాన్సిల్ కావడంతో అందరికీ సుపరిచితమయ్యారు.. అయితే ఈ ఘటన తర్వాత రక్షిత్ తన సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం జరిగింది.. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న రక్షిత్ శెట్టి అప్పటి నుంచి తన ప్రతి సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.


గత ఏడాది 777 చార్లీ సినిమాతో విజయాన్ని అందుకున్న రక్షిత ఏడాది సప్తసాగరాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ హేమంత్ రావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన విడుదల చేశారు. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించింది.ఇప్పుడు తాజాగా నవంబర్ 17న ఈ సినిమా రెండో భాగం విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్ర బృందం పలు రకాల ఇంటర్వ్యూలను ఇవ్వడం జరిగింది.

తాజాగా రక్షిత్ శెట్టి ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన జీవితంలో జరిగిన మొదటి లవ్ స్టోరీ ని తెలిపారు.. తను ఇంజనీరింగ్ చదువుతున్న సెకండియర్ లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించి లవ్ లెటర్ రాసి ఇవ్వమని తన స్నేహితుడికి ఇచ్చానని.. అయితే తాను హాస్టల్ లో ఉన్నాడని ఆ అమ్మాయి మాత్రం బస్సులో వచ్చేదని అందుకే తన స్నేహితుడికి ఇచ్చి తనకు ఇవ్వమని చెప్పగా ఆ లెటర్ ఇచ్చాక కూడా ఆమెలో ఎలాంటి ఫీలింగ్స్ కనిపించలేదట..కానీ చాలా సార్లు ఆమెకి ఇవ్వడం చూడకపోవడంతో ఇలా కాలేజే అయిపోయిందని.. అయితే తనకు తెలిసిన విషయం ఏమిటంటే తాను ఇచ్చిన లెటర్స్ ని తన ఫ్రెండ్ ఆ అమ్మాయికి ఇవ్వలేదట.. ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే ప్రస్తుతం వారిద్దరూ భార్యాభర్తలు గా ఉన్నారని చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా నవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: