ఈ ఏడాది ఓపెనింగ్ లోనే అదరగొట్టిన టాప్ 10 చిత్రాలు ఇవే..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం లియో.. ప్రేక్షకుల నుంచి ఊహించని క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా సునామి సృష్టించిందని చెప్పవచ్చు. ఇకపోతే ఓపెనింగ్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.145 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
మరో వైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా కూడా ఇటీవల విడుదలై భారీ అంచనాల మధ్య మొదటి రోజు రూ .135 కోట్లు వసూలు చేసి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రాల తర్వాత జవాన్ రూ .129 కోట్లు, పఠాన్ - రూ.106 కోట్లు, జైలర్ - రూ.95 కోట్లు, టైగర్3 - రూ.95కోట్లు, పొన్నియిన్ సెల్వన్2 - రూ.58కోట్లు, గదర్2 - రూ.54 కోట్లు, వీరసింహారెడ్డి - రూ.50 కోట్లు,
వాల్తేర్ వీరయ్య - రూ.49.5 కోట్లు వసూల్ చేయడం జరిగింది.