మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుండి మరొక క్రేజీ అప్డేట్..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా గుంటూరు కారం. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా వంటి సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు గుంటూరు కారం అనే ఒక మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ కాంబినేషన్ ఇక గుంటూరు కారం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ లో మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించనున్నాడు. గుంటూరు కారం లో మహేష్ కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. రీసెంట్  గుంటూరు కారం నుంచి దమ్ మసాలా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈసాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అలా సినిమా పై అంచనాలు పెంచేసింది ఈ సాంగ్.


గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న గుంటూరు కారం ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెకండ్ సాంగ్ గా ఓ మెలోడీని రిలీజ్ చేయనున్నారట. త్వరలోనే దీని పై ఓ అప్డేట్ ఇవ్వనున్నారట. అలాగే ఇంకో నాలుగు సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందట. అంతేకాదు ఈ పాటతో గుంటూరు కారం షూటింగ్స్ సైతం పూర్తవుతుంది అని సమాచారం వినబడుతుంది. అలా డిసెంబర్ వరకు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: