బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని యానిమల్ లాగా మార్చి మరింతగా ప్రేక్షకులకు వయోలెంట్ ఎక్స్పీరియన్స్ అందివ్వడానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ లో రణ్ బీర్ లుక్ చూస్తేనే అతన్ని ఎంత వైలెంట్ క్యారెక్టర్ గా చూపించబోతున్నారు అర్థమవుతోంది.ఆల్రెడీ షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరగతున్నాయి. మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ ను అనుకోవడమే కాకుండా మూవీపై పాజిటివ్ బజ్ ని కూడా క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్ ను మేకర్స్ విడుదల చేయడం జరిగింది.ఈ సాంగ్ లో సందీప్.. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా డీప్ గా అందరికి చూపించాడు. అయితే ఈ సాంగ్ ని జాగ్రత్తగా గమనిస్తే మూవీ స్టోరీ ఏంటో పూర్తిగా అర్థం అయిపోతోంది.ఈ సాంగ్ లో హీరోకి చిన్నప్పటి నుంచి తన తండ్రి అంటే చాలా ఇష్టం.. బిజినెస్ కారణంగా తండ్రి అతనిని అశ్రద్ధ చేయడం ఇంకా కొడుకుతో తండ్రికి స్పెండ్ చేయడానికి టైం లేకపోవడం లాంటి సీన్స్ చూపిస్తారు.
ఇక ఫైనల్ గా పెరిగి పెద్దయిన కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి పరిచయం చేసినా ఆ తండ్రి దగ్గర మాట్లాడడానికి టైం లేదు. దీంతో బాగా డిస్టర్బ్ అయి హీరో తండ్రికి దూరంగా వెళ్ళిపోయి తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంటాడు. అయితే ఎవరో తెలియని బిజినెస్ రైవల్స్ తండ్రిపై హత్యాయత్నం చేస్తున్నారు అన్న వార్త తెలుసుకొని అతను తిరిగి తన తండ్రి దగ్గరకు వస్తాడు.అప్పటి దాకా చాలా ప్రశాంతంగా ఉన్న అతని లైఫ్ లో అసలు తుఫాన్ అప్పుడే మొదలవుతుంది. తండ్రిని కాపాడుకునే క్రమంలో అతనిలో దాగి ఉన్న 'యానిమల్' వెర్షన్ ఇక బయటకు వస్తుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలైన కోత..అది భయంకరమైన ఊచకోత. సాంగ్ లాస్ట్ కి వచ్చేసరికి ఒక సీన్లో విపరీతంగా దెబ్బలు తగిలిన ఏమాత్రం తగ్గకుండా హీరో ప్లేన్ ని నడుపుతూ ఉంటాడు. ఇలాంటి హై ఇంటెన్సిటీ సీన్స్ థియేటర్లో చూస్తే నిజంగా ఆ కిక్ వేరుగా ఉంటుంది.ఇక ఈ సినిమా నిడివి మొత్తం 3 గంటలు ఉంటుందట. ఈ సినిమా ట్రైలర్ కట్ ప్రాసెస్ లో ఉందట. వచ్చే వారం ఈ మూవీ ట్రైలర్ దుబాయ్ బుర్జ్ ఖలీఫా వేదికగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది.