వారిద్దరి మధ్య చిచ్చు పెట్టబోయిన బాలీవుడ్ డైరెక్టర్...!!

murali krishna
బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వస్తున్నా ప్రోగ్రాం 'కాఫీ విత్ జోహార్ '. అయితే ఇటీవల ఈ
కార్యక్రమం లో ఒళ్లు మండే ప్రశ్నలడుగుతూ పుళ్లమీద కారం జల్లే పని లో బిజీ అయిపోయాడు కరణ్‌ జోహార్‌.ఆయన ఈ ప్రోగ్రాం లో ఈ మధ్య ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య చిచ్చు పెట్టబోయదంట. అయితే రీసెంట్‌ ఇంటర్వ్యూలో కరీనా, అలియా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం లో చేదు జ్ఞాపకాలను వెలికితీస్తూ కరీనాను కాస్తంత ఇబ్బందికి గురిచేసే ప్రయత్నమే చేశాడు కరణ్‌. 'ఇటీవల జరిగిన 'గదర్‌- 2' పార్టీకి ఎందుకు అటెండ్‌ కాలేదు. అమీషా కూ నీకూ మధ్య ఏదో భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉన్నట్టుంది?' అని అడిగాడు కరణ్‌. 'ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలను కోవడంలేదు' అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చేసింది కరీనా. 'కహోనా ప్యార్‌ హై'లో నువ్వే కదా ఫస్ట్‌ హీరోయిన్‌?' అని కరణ్‌ రెట్టించి అడగడంతో కరీనా కు ఫేస్‌ మారిపోయింది. సమాధాన మివ్వకుండా మౌనంగా ఉండిపోయింది.

ఇక అసలు విషయానికొస్తే.. 2000లో విడుదలైన 'కహోనా ప్యార్‌హై' అఖండ విజయాన్ని చూసింది. ఆ సినిమాకు తొలుత హీరోయిన్‌ గా దర్శకుడు రాకేష్‌రోషన్‌ కరీనా నే ఎంపిక చేశాడు. కానీ అనుకోని మనస్పర్థల వల్ల కరీనాను తొలగించి అమీషా పటేల్‌ని తీసుకోవడం జరిగింది. అప్పట్నుంచి కరీనాకు, అమీషాకు మాటల్లేవ్‌. ఈ విషయాన్ని అమీషానే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపింది. జరిగి పోయిన ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ కరీనాను దాదాపు గా ఇరిటేట్‌ చేశాడు కరణ్‌ జోహార్‌. అంతటి తో వదల్లేదు తను. 'దీపికా పదుకొణేకు నువ్వు పోటీ అనుకుంటున్నావా?' అనడిగాడు. ' ఆ ప్రశ్న నువ్వడగాల్సింది నా పక్కనే ఉన్న అలియాను.. నన్ను కాదు' అంటూ డిగ్నిఫైడ్‌ సమాధానంతో కరణ్‌ను ఖంగు తినిపించింది కరీనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: