నందమూరి నట సింహం
బాలకృష్ణ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఓ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన రెండు సీజన్ లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే ఈ టాక్ షో కు సంబంధించిన మూడవ సీజన్ ప్రారంభం అయింది. అందులో భాగంగా
బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్
కేసరి మూవీ బృందం ఈ సీజన్ మొదటి
ఎపిసోడ్ కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
యానిమల్
మూవీ లో
హీరో గా నటించిన రణ్బీర్ కపూర్ ...
హీరోయిన్ గా నటించిన
రష్మిక మందన ... ఈ సినిమాకు దర్శకత్వం వహించిన
సందీప్ రెడ్డి వంగా ఈ రెండవ
ఎపిసోడ్ కు గెస్ట్ లుగా రాబోతున్నారు. ఇకపోతే ఈ
ఎపిసోడ్ లో లైవ్
ఫోన్ కాల్ ద్వారా
విజయ్ దేవరకొండ కూడా మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ
ఎపిసోడ్ ను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే
అర్జున్ రెడ్డి మూవీ తర్వాత
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన
మూవీ కావడంతో యానిమల్
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.