తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి అజయ్ భూపతి తాజాగా మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాను నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ మూవీ లోని ప్రచార చిత్రాలు అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నెల 17 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రమోషన్స్ ను ఈ రోజు అనగా నవంబర్ 16 వ తేదీన భారీ ఎత్తున చాలా థియేటర్ లలో ప్రదర్శించబోతున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన విషయాన్ని ఈ మూవీ బృందం వారు ప్రకటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని ఏ థియేటర్ లలో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు అనే విషయాన్ని కూడా ఈ మూవీ బృందం ప్రకటించింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క పెయిడ్ ప్రమోషన్స్ ను ఈ రోజు విజయవాడ లోని క్యాపిటల్ సినిమాస్ ... వైజాగ్ లోని శరత్ ... నెల్లూరు లోని ఎమ్ఐ సినిమాస్ ... కాకినాడ లోని చాణిక్య ... భీమవరం లోని ఏవిజి మల్టీప్లెక్స్ ... గుంటూరు లోని గౌరీ శంకర్ థియేటర్ లలో ఈ మూవీ యొక్క పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే అజయ్ భూపతి ఆఖరిగా దర్శకత్వం వహించిన మహాస ముద్రం సినిమా ప్రేక్షకులను నిరాశ పరచింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.