దూత పై నమ్మకం పెట్టుకున్న నాగచైతన్య !
అక్కినేని కాంపౌండ్ కు ‘మనం’ లాంటి మెమరబుల్ సినిమాను అందించిన విక్రమ్ కుమార్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు బాగా ఉన్నాయి. అయితే ‘మనం’ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘హలో’ ‘థాంక్యూ’ అక్కినేని యంగ్ హీరోలకు కోరుకున్న హిట్ ఇవ్వలేకపోవడంతో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని సందేహాలు కొందరికి వచ్చాయి.
అయితే అందరి సందేహాలను తలక్రిందులు చేస్తూ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయడంతో చైతూ అభిమానులు జోష్ లో ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుండి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు తీసిన విక్రమ్ కుమార్ తన కెరియర్ లో మొదటిసారిగా హారర్ జోనర్ ను టచ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది రొటీన్ దెయ్యాలు ఆత్మలకు సంబంధించిన కథ కాదని ఈ కథలో చాల ట్విస్ట్ లు ఉంటాయని విక్రమ్ కుమారర్ చెపుతున్నాడు. తెలుగుతో పాటు 5 భాషాలాలో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతోంది. మన చుట్టూ జరుగుతున్న అంతుచిక్కని మరణాల వెనుక ఉన్న రహస్యాలు విభ్రాంతి కలిగించే రీతిలో ఉన్న వాటి మధ్య ఉన్న కనెక్షన్లు చనిపోయాక మనుషులు ఆత్మలు ఎలా తిరుగుతాయి అన్నవిషయాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ ఉంటుంది అని అంటున్నారు. నాగచైతన్య లాంటి మీడియం రేంజ్ హీరోకి ఇలాంటి భారీ వెబ్ సిరీస్ లో అవకాశం రావడంతో చైతూ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగే ఆస్కారం ఉంది..