వారిద్దరి మధ్య
లవ్ ట్రాక్ సంభాషణలు వంటివి ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఇక ఈ సినిమాలో
వరుణ్ తేజ్ నటనకి చాలా మంచి మార్కులు పడ్డాయి. దాంతోపాటు
హీరోయిన్ రాశి ఖన్నా కి సైతం ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఇకపోతే ఈ
సినిమా కంటే ముందు
రాశి కన్నా కెరియర్ కాస్త అటు ఇటుగా ఉంది అని చెప్పాలి. కానీ ఈ
సినిమా తరువాత తనకి దాదాపుగా అరడజనుకు పైగానే సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అలా ఈ సినిమాతో మళ్లీ
సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది రాశిఖన్నా. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అదేంటంటే
తొలిప్రేమ సినిమాకి ఫస్ట్ ఛాయిస్
రాజశేఖర్ అన్న కాదట. మరో స్టార్
హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. ఆ అవకాశం రాశీకి దక్కిందట. అవును ‘తొలిప్రేమ’ చిత్రాన్ని మిస్ చేసుకున్న
హీరోయిన్ మరెవరో కాదు మెహరీన్ కౌర్ పిర్జాదా. అవును.. ముందుగా
వర్ష పాత్ర కోసం మెహరీన్ ను అడిగారట. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ తర్వాత మెహరీన్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత వరుసగా ఆమె 6 ప్రాజెక్టులకు సైన్ చేసిందట. అదే టైంలో ‘తొలిప్రేమ’ ఆఫర్ కూడా వచ్చిందట. కానీ అప్పటికే తన చేతిలో ఆరు ప్రాజెక్టులో ఉండడంతో తను చాలా బిజీగా ఉంది. ఇక అదే సమయంలో
తొలిప్రేమ సినిమా అవకాశం రావడంతో చేసేదేమీ లేక ఈ సినిమాని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది మెహరీన్..!!