వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' ట్రైలర్..!!

Anilkumar
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ తేజ్ మొదటి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.  'ఉప్పెన' తర్వాత ఈ హీరో నటించిన 'కొండపొలం''రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా సాలిడ్ కొట్టాలనే ఉద్దేశంతో త్వరలోనే 'ఆదికేశవ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు వైష్ణవుతేజ్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా


 పరిచయం అవుతున్నారు. ఈసారి 'ఆదికేశవ' తో మాస్ హీరోగా మెప్పించేందుకు రెడీ అయ్యాడు వైష్ణవ్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్' సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు ట్రైలర్ అప్డేట్ ని అందించారు మేకర్స్. 'ఆదికేశవ' యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ ని నవంబర్ 17న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సినిమాకు సంబంధించి ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ యాంగ్రీ లుక్ తో రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని ఉండడం, 


వెనకాల మలయాళ నటుడు భోజు జార్జ్ సీరియస్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టల్ బట్టి ఈ మూవీ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ యాక్టర్స్ బోజు జార్జ్, అపర్ణ దాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: