షాకిస్తున్న టైగర్ 3 వసూళ్లు.. వార్ 2 కి బిగ్ ఎఫెక్ట్?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా టైగర్-3. దీపావళి పండుగ కానుకగా ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజే మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.మొదటి రెండు రోజుల్లో రెండు వంద కోట్లకు పైగా వసూళ్లతో ఈ సినిమా దూసుకెళ్లింది. దీంతో సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడిందంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మూడో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు తగ్గిపోయాయి.ఓవర్ సీస్ లో కేవలం 7.9 మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే ఈ సినిమా రాబట్టింది.దీంతో స్పై సినిమాలు బాలీవుడ్ ఆడియన్స్ కి బోర్ కొట్టయేమో అనే సందేహం మొదలైంది. ఈ ప్రభావం ఖచ్చితంగా రాబోయే వార్ 2 సినిమా పైన ఖచ్చితంగా పడుతుంది. పైగా ఈ సినిమాకి అయాన్ ముఖర్జి లాంటి ప్రేమ కథ చిత్రాల దర్శకుడు కావడం భయం కలిగించే విషయం. బ్రహ్మస్త్ర సినిమాతో ప్రయోగం చేసి షాక్ తిన్న అయాన్ ఇప్పుడు వార్ 2 సినిమా ఎలా తీస్తాడో అని అభిమానులు భయపడుతున్నారు.



ఇప్పుడు టైగర్ 3 సినిమా 600 కోట్లు సాధిస్తే గాని క్లీన్ హిట్ అవ్వదు. నిజానికి సల్మాన్ ఖాన్ కి ఆ 600 కోట్లు కూడా చాలా తక్కువ. అతను చేసిన భజరంగి భాయ్ జాన్, సుల్తాన్ సినిమాలు చాలా ఈజీగా 600 కోట్ల వసూళ్లు దాటాయి. కానీ టైగర్ 3 సినిమా వాటి దారిదాపుల్లోకి కూడా వెళ్లేలా లేదు.ఇప్పటిదాకా 600 కోట్ల క్లబ్ లో మొత్తం నార్త్ సౌత్ ఇండస్ట్రీలు కలిపి 14 సినిమాలు ఉన్నాయి. అయితే 15 వ సినిమాగా 600 కోట్ల క్లబ్ లో టైగర్ 3 నిలుస్తుందో లేదో చూడాలి.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.ఈ సినిమా త్వరలోనే ఓటీటీకి రానుందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం తెలుస్తోంది.అందుకే నెల రోజుల్లోపే ఓటీటీకి రానున్నట్లు సమాచారం.ఎందుకంటే గత రెండు రోజులుగా ఈ మూవీ కలెక్షన్స్ తగ్గడమే కారణమని భావిస్తున్నారు.ఇంకా అంతే కాకుండా ఈ వారంలోనే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు జరగడంతోనే కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు మేకర్స్ అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: