ఏంటి.. జబర్దస్త్ వినోద్ కు చేతబడి చేశారా.. అందుకే ఇలా మారిపోయాడా..!?

Anilkumar
ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ షోని చూసే వారందరికీ వినోద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై వినోదినిగా లేడీ గెటప్స్ వేస్తూ అందరిని అలరిస్తూ ఉంటాడు ఈ కమీడియన్. ముఖ్యంగా ఇప్పుడైతే జబర్దస్త్ లో అమ్మాయిలే అల్లరిస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం లేడీ గెటప్స్ వేసుకుని అబ్బాయిలే అమ్మాయిల పాత్రలో కనిపించేవారు. అలాంటి సమయంలో చమ్మక చంద్ర తో కలిసి వినోద్ చేసిన అల్లరి ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. నిజంగా అమ్మాయి అని అనిపించేలాగా చాలా అందంగా తయారై జబర్దస్త్ ద్వారా చాలామంది


అభిమానులను సొంతం చేసుకున్నాడు వినోద్. ఆమధ్య పెళ్లికూడా చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. దానితోపాటు మరొక పక్కా యూట్యూబ్ ఛానల్ సైతం నడుపుకుంటూ మరొక పక్క జబర్దస్త్ కూడా చేస్తూ బాగానే ఉన్నాడు అని అనుకున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను అనారోగ్యానికి గురైన వ్యవహారం గురించి చెబుతూ తన మీద చేతబడి చేశారేమో అని అనుమానం కూడా వ్యక్తం చేశాడు. తనకు హాస్పిటల్కి చేతబడి విరుగుడు పూజలకు కలిపి దాదాపు 3 లక్షల వరకు ఖర్చయిందని ఆయన చెప్పుకొచ్చారు.


తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని తన సహనటులు చాలామంది సహాయం చేశారని తాను ఎవరిని సహాయం అడగకపోయినా వారాంతటి వారే ముందుకు వచ్చి సహాయం చేయడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఇంటి ఓనర్ తో గొడవ అయినప్పుడు చేయి విరిగిందని చెప్పుకొచ్చిన ఆయన ఒక విషయంలో హామీ ఉండటంతో ఐదు లక్షల నష్టపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఆరోగ్యం కుదుటపడుతోందని అంతా సెట్ అయిన తర్వాత జబర్దస్త్ తో పాటు ఈవెంట్స్ కూడా చేసుకుంటానని చెబుతున్నాడు. మొత్తానికి అయితే తన మీద ఎవరో చేతబడి చేశారు అంటూ వినోద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఏ వార్త విన్న కొందరు ఈ కాలంలో అవన్నీ నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు చేయగా మరికొందరు నిజమేనేమో అని కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: