ఓటీటీ స్ట్రీమింగ్ లో వారం రోజులు వాయిదా పడ్డ 'లియో' మూవీ...!!
అంత మంచి క్వాలిటీ ప్రింట్ వచ్చేసింది కాబట్టి ఓటీటీ లో తొందరగా విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సినిమాకి మరో వీకెండ్ కూడా థియేటర్స్ నుండి రెవిన్యూ వచ్చే అవకాశాలు ఉండడంతో మరో వారం రోజులకు ఓటీటీ( OTT ) విడుదల తేదీ వాయిదా వేయించినట్టు తెలుస్తుంది. అంటే నవంబర్ 23 వ తారీఖున ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఈ వీకెండ్ లో వస్తుంది, ఇంట్లో కూర్చొని సరదాగా ఎంజాయ్ చెయ్యొచ్చు అని అనుకున్న సినీ ప్రియులకు మాత్రం నిరాశని మిగిలించింది. ఓటీటీ లోకి వచ్చినప్పటికీ కూడా థియేటర్స్ లో చూడాలని అనుకున్న వాళ్ళు కచ్చితంగా చూస్తారు, ఆ మాత్రానికి ఓటీటీ విడుదల వాయిదా వెయ్యడం ఎందుకు అని అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అభిమానులు అయితే థియేట్రికల్ రన్ ఇంకా ఉన్నప్పుడు వారం రోజులు ఓటీటీ వాయిదా వేస్తె మీకొచ్చిన నష్టం ఏమిటి?, కొద్ది రోజులే కదా ఆగండి అని సర్ది చెప్తున్నారు.