యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందదే. మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక అందుకోసమే.. కొరటాల, ఎన్టీఆర్.. ప్రతిదీ ఆచితూచి.. టైమ్ ఎక్కువ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా చెక్కుతున్నారు. ఇక ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు గోవాలో చిత్రీకరించారట. ఇక్కడ ఫినిష్ చేసుకొని గోకర్ణ వెళ్లనున్నట్లు సమాచారం.
ఇక గోవాలో ఒక రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం గోవా బీచ్ దగ్గర ఒక బీచ్ సాంగ్ ను ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రైవేట్ గోవా బీచ్ లో ఒక విలేజ్ సెట్ కూడా సెట్ చేశారని తెలుస్తోంది. ఇక ఇందులో ఎన్టీఆర్, జాన్వీ రొమాన్స్ ఘాటుగానే ఉంటుందని టాక్. బీచ్ సాంగ్… ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, జాన్వీ అందాలు.. కొరటాల టేకింగ్.. వేరే లెవెల్ అని ఫ్యాన్స్ ఇప్పటికే ఊహించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో బీచ్ సాంగ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా టెంపర్ లో బీచ్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవరాలో కూడా అదే రీపీట్ అవుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.