మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని రోజుల్లో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించనుండగా ... యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 156 మూవీ గా రూపొందనుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ ను "మెగా 156" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను అన్నింటిని ఈ మూవీ దర్శకుడు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ 23 వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ ను మారేడుమిల్లి అడవి ప్రాంతంలో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను చిరంజీవి లేని సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు ఆ తర్వాత డిసెంబర్ నెల నుండి ఈ షెడ్యూల్ లో చిరంజీవి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు మొదటి షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను రూపొందించబోతున్నట్లు సమాచారం.
ఇందులో ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించబోయే నటీనటులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించే విధంగా ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నట్లు ఒక వేళ మరింత ఎక్కువ బడ్జెట్ అయినా సరే ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.