తారక్ నటించిన ఆ మూవీని.. బాలయ్య 100 సార్లు చూశాడట తెలుసా?

praveen
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్న వారిలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు హీరోలకు సంబంధించి ఇప్పటికే మీరు ఒక వార్తను చూసే ఉంటారు. బాలయ్యకు తారక్ అంటే అసలు పడదని   అందుకే తారక్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కాస్త సీరియస్ అవుతుంటారని.  ఎన్నో వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్న విషయం మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు.


 అయితే ఇక బాలయ్య, తారక్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఒక హెల్తీ రిలేషన్షిప్ ఉంది అన్న విషయం చెప్పినా ఎవరు నమ్మరు. అయితే బాలయ్య తారక్ మధ్య మాటలు ఉన్నాయి అన్నది తెలియజేసేలా ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో బాలయ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా గురించి పరోక్షంగా బాలయ్య వివరించారు  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.


 ఆ సినిమాను దాదాపు 100 సార్లకు పైగానే చూసి ఉంటా అంటూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు బాలయ్య  ఎన్నిసార్లు చూసినా ఆ సినిమా కొత్త ఫీలింగ్ కలుగుతుంది అంటూ తెలిపారు. పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ నటన బాగుందని ఇక ఎప్పుడు చూసినా మరింత కొత్తగా అనిపిస్తుంది అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి ఇక బాలయ్య తారక్ మధ్య అసలు ఎలాంటి విభేదాలు లేవు అని.. ఫ్యామిలీ అంతా కలిసికట్టుగానే ఉంది అని కేవలం కొంతమంది పనిగట్టుకుని మరి ఇక వాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు రాస్తున్నారు అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: