ఒకేసారి రంగంలోకి దిగబోతున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా..!?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఒకే ముహూర్తం ఫిక్స్ చేశారా.. ఇద్దరు ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినబడుతోంది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తన 156 వ సినిమా ఇప్పటికీ స్టార్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఇంకా డిలే జరుగుతూనే ఉంది. అయితే ఈనెలఖరి నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించాలి అని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ .


 మొదటి షెడ్యూల్ లోనే యాక్షన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలి అని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని చాలా ప్రత్యేకంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ  అంచనాలనుకున్నాయి. దానికి తోడు చిరంజీవి ఇటువంటి సినిమాల్లో కనిపించి చాలా కాలం అవ్వడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాలుగు నుండి ఐదు వరకు హీరోయిన్లు ఉంటారు అన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు.


అనుష్క పేరు మెయిన్ లీడ్ లో భాగంగా బలంగా వినిపిస్తుంది. ఇంకా చిరు వయసు మ్యాచ్ చేసే సీనియర్ నాయికల కోసం వేట కొనసాగుతున్నట్లు సమాచారం. విజువల్ వండర్ గా చిత్రాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇక ఇదే నెలఖరులోనే మాస్ రాజా రవితేజ-గోపీచంద్ కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ కానుంది. రవితేజ షూటింగ్ సైతం భారీ యాక్షన్ షెడ్యూల్ తోనే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. పైగా వీళ్లిద్దరి కలయికలో మంచి సక్సెస్ రేట్ ఉంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకే నెలలో చిరంజీవి..రవితేజ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వడం..అందులోనూ యాక్షన్ షెడ్యూల్ తో షురూ అవ్వడం ఇదే తొలిసారి. చూద్దాం మరి చివరికి ఏం జరుగుతుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: