గడ్డం మ్యానియాలో టాప్ హీరోలు !
‘రంగస్థలం’ రామ్ చరణ్ ‘పుష్ప’ లో అల్లు అర్జున్ ‘పంజా’ లో పవన్ కళ్యాణ్ ‘నాన్నకు ప్రేమతో’ జూనియర్ ఎన్టీఆర్ ‘కెజిఎఫ్’ లో యష్ ‘కాంతార’ మూవీలో రిషబ్ శెట్టి ఇలా చాలమంది యంగ్ హీరోలు ఇప్పటికే గుబురు గడ్డం పెంచుకోవడం ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అయితే ఈ లిస్టులో మహేష్ బాబు యంగ్ హీరో నిఖిల్ లు కూడ తమ లేటెస్ట్ సినిమాలకు సంబంధించి ఈ గడ్డం మ్యానియలో చిక్కుకోకుండా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈ గడ్డం కు సంబంధించి టాప్ యంగ్ హీరోలు ప్రస్తుతం ఎంత గడ్డం పెంచుకుంటే అంత బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో తమ భారీ సినిమాలలో ఇంచుమించు తమ పాత్రకు సంబంధించి పూర్తి గడ్డంతో ఉన్నప్పుడు మాత్రమే తమ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్న ఉద్దేశ్యంతో తాము నటించే భారీ సినిమాలలో కొన్ని సీన్స్ లో అయినా మాసిపోయిన గడ్డం లుక్ తో కనిపిస్తూ పరోక్షంగా తమ గడ్డం మ్యానియాను చాటుకుంటున్నారు.
అయితే ఈట్రెండ్ లో భారీ సినిమాల హీరోలతో తమ లుక్ నిలబడాలి అంటే ఎప్పటికప్పుడు తమ గడ్డాన్ని కూడ పెంచుకోవాలి అంటూ చాలామంది మీడియం రేంజ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ లిస్టులో కొందరు యంగ్ హీరోలు మాత్రం ముఖ్యంగా నితిన్ లాంటి హీరోలు ఈ గడ్డం మ్యానియాకు దూరంగ ఉంటున్నారు. అయితే భారీ సినిమాలలో నటిస్తున్న టాప్ హీరోలు మాత్రం ఎంత గడ్డం పెంచుకుంటే అంత బ్లాక్ బస్టర్ వస్తుంది అన్న నమ్మకంతో తమకు ఉన్న గడ్డా లలో అనేక మార్పులు చేసుకుంటున్నారు...