బుచ్చిబాబు కు ఓకె చెప్పిన సాయి పల్లవి !

Seetha Sailaja
‘విరాటపర్వం’ మూవీ తరువాత సాయి పల్లవి ఏఒక్క తెలుగు సినిమా ప్రాజెక్ట్ కు ఓకె చేయకపోవడంతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంచుమించు దూరం అయినట్లే అంటూ ఇండస్ట్రీలో ఊహాగాణాలు కొనసాగుతున్నాయి. అయితే సాయి పల్లవి తో గతంలో ‘లవ్ స్టోరీ’ మూవీ తరువాత ఆమెకు కథలు చెప్పడానికి ఎందరో దర్శకులు ప్రయత్నించినప్పటికీ ఆమె వారు చెప్పే కథలను వినడానికి కూడ పెద్దగా ఆశక్తి కనపరచకపోవడంతో సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీకి శాశ్వితంగా దూరం అయినట్లే అంటూ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.



దీనికితోడు గత సంవత్సరం ఉత్తమ నటీనటుల అవార్డులను ప్రకటించిన నేపధ్యంలో సాయి పల్లవి ని ఏదోవిధంగా తమ సినిమాలలో నటించడం కోసం ఒప్పించాలని అనేకమంది ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా ఆమె టాలీవుడ్ కు దూరం అయింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఒక్క తెలుగు సినిమా మినహా ఆమె కన్నడ మళయాళ సినిమా రంగంలో కొత్త సినిమాలను వరస పెట్టి ఒప్పుకుంటోంది.



దీనితో ఇక సాయి పల్లవి తెలుగు సినిమాలలో కనిపించకపోవచ్చు అన్న వార్తలు వచ్చాయి. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సాయి పల్లవి ఒక భారీ తెలుగు మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పింది అన్న వార్తలు వస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ మూవీ తరువాత రామ్ చరణ్ తో తీయబోతున్న మూవీలో చరణ్ పక్కన హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపిక అయింది అన్న వార్తలు వస్తున్నాయి.  



వాస్తవానికి ఈ మూవీలో బాలీవుడ్ ఒకనాటి హీరోయిన్ రవీనా తండన్ కూతురు రషా తడని స్థానంలో సాయి పల్లవి ఎంపిక అయింది అని అంటున్నారు. ఒకానొక సందర్భంలో ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరును కూడ పరిశీలించినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు హీరో రామ్ చరణ్ సాయి పల్లవికి చరణ్ బుచ్చి బాబు ఓటు వేసినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: