ప్రభాస్ కి మాత్రమే ఆ పని చేస్తా అంటున్న పాయల్..!!
తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ పలు ప్రశ్నలు అడగడం జరిగింది.. ఇందులో భాగంగా మీరు రోజ్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.. పాయల్ సిగ్గుపడుతూ తాను రోజా పువ్వు ఇచ్చే ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే అని తెలిపింది. ప్రభాస్ తన ముందుకు వస్తే కచ్చితంగా ఇలాంటి పని చేస్తానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. రోజా పువ్వు ఇచ్చి మరి ఐ లవ్ యు చెబుతానని అనగా పాయల్ సిగ్గుపడుతూ ఇంటర్వ్యూలో తన సినిమా కంటే ఎక్కువగా ప్రభాస్ గురించి చర్చించుకుంటున్నామంటూ తెలిపింది.
తనకి ఆదివారాలు అంటే చాలా ఇష్టమని సండే రోజున కచ్చితంగా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటానని తనకు ఏది కావాలో అదే స్వయంగా వండుకొని తింటానని తెలుపుతోంది. తనకు రాజ్మా రైస్ అంటే చాలా ఇష్టమని తెలియజేస్తోంది.. ఇలాంటివి చేసి ప్రభాస్కి ఎప్పుడైనా సరే పెట్టాలనుకుంటున్నానని స్వయంగా నా చేతితోనే వడ్డిస్తానని పాయల్ తెలియజేయడం జరిగింది. తాజాగా పాయలు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.దీంతో పలువురు అభిమానులు సైతం కాయల్ని పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రభాస్ సినిమాలో ఏదైనా అవకాశాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ.