లియో "నా రెడీ" సాంగ్ విడుదల తేదీ... సమయం వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా తమిళ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా నవంబర్ 21 వ తేదీ నుండి ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ కాబోతోంది.
 


ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరి థియేటర్ లలో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ లోని "నా రెడీ" అంటూ సాగే వీడియో సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సాంగ్ ధియేటర్ లలో కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: