గోపీచంద్... రామ్ పోతినేని మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో గోపీచంద్ ... రామ్ పోతినేని కూడా ఉన్నారు. ఇక వీరు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ నటులు ప్రస్తుతం ఏ మూవీ లలో హీరోలుగా నటిస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ మూవీ బృందాలు ఈ మూవీ లకు సంబంధించిన ఏ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ గోపీచంద్ కెరియర్ లో 32 వ మూవీ గా రూపొందుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను గోవా పరిసర ప్రాంతాల్లో గోపీచంద్ మరియు ఇతరులపై ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తుంది.

టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే డబల్ ఈస్మార్ట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం రామ్ మరియు ఇతరులపై ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ఇకపోతే గోపీచంద్ ... రామ్ పోతినేని ప్రస్తుతం హీరోలుగా రూపొందుతున్న ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ఈ రెండు కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లుగా రూపొందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: