ప్రతి
సినిమా ఇండస్ట్రీలో ప్రతి జనరేషన్ కి ఇద్దరు సూపర్ స్టార్స్ టాప్ 2 స్థానం లో ఉంటూ ఎవరికీ అందనంత రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటూ ఉంటారు. మన
టాలీవుడ్ లో అలా ఒకప్పుడు
ఎన్టీఆర్ - ఏఎన్నార్, ఆ తర్వాత
కృష్ణ - శోభన్ బాబు , ఆ తర్వాతి తరం లో
చిరంజీవి -
బాలకృష్ణ ఇలా టాప్ లో వున్నారు.ఇలా వీళ్లంతా తమ జెనెరేషన్స్ లో టాప్ 2 స్టార్స్ గా కొనసాగుతూ పోటీ పడుతూ వస్తున్నారు. అలా నేటి తరం లో
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ -
సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ 2 స్టార్స్ అని,
టాలీవుడ్ కి ఈ తరం లో మెయిన్ పిల్లర్స్ వెళ్లే అని ఫ్యాన్స్ ఇంకా ట్రేడ్ పండితులు సైతం చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా 2010 నుండి 2016 దాకా ఈ ఇద్దరి హీరోల క్రేజ్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ కి దరిదాపుల్లో వచ్చే హీరోనే లేడు. ఆ స్థాయిలో డామినేషన్ చేస్తున్నారు.నైజాం,
ఆంధ్ర ప్రదేశ్ ఇంకా ఓవర్సీస్ మర్కెట్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన హీరోలు కూడా వీళ్ళే.అయితే
బాహుబలి సినిమా తర్వాత మన
టాలీవుడ్ స్థాయి రీజినల్ నుండి పాన్
ఇండియా రేంజ్ కి వెళ్ళింది. పవన్
కళ్యాణ్, మహేష్ బాబు నుండి పాన్
ఇండియా సినిమాలు రాకపోవడం తో పాన్
ఇండియన్ మార్కెట్ లో ప్రభాస్,
ఎన్టీఆర్,
అల్లు అర్జున్ ఇంకా
రామ్ చరణ్ పోటీ పడుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ వీళ్లిద్దరు తమ ఆధిపత్యం ని చూపిస్తూ అందరి హీరోల అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఇక అందుకు ఉదాహరణ వీళ్లిద్దరి రీ రిలీజ్ సినిమాలే.ఒక
హీరో కి ఫ్యాన్ బేస్, క్రేజ్ ఎలా ఉంటుందో కొలవడం కష్టం. కానీ ఇలా రీ రిలీజ్ సినిమాల ద్వారా ఒక కొలమానం తీసుకోవచ్చు. ఇప్పటి దాకా మన
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వీళ్లిద్దరి రికార్డ్స్ ని అస్సలు ముట్టుకోలేకపోయారు.ముందుగా
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ ట్రెండ్ సెట్ చేశారు.'పోకిరి ', 'ఒక్కడు' సినిమాలతో సెన్సేషన్ ని సృష్టించి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పాడు. ఆ తర్వాత ఈ రికార్డు ని పవన్
కళ్యాణ్ ఫ్యాన్స్ 'జల్సా' చిత్రాన్ని స్పెషల్ షోస్ గా వేసుకొని కొత్త రికార్డుని నెలకొల్పారు.ఆ తర్వాత మళ్ళీ పవన్
కళ్యాణ్ ఫ్యాన్స్ 'ఖుషి' చిత్రాన్ని రీ రిలీజ్ చేసి మళ్ళీ ఆల్ టైం రికార్డు పెట్టారు. మళ్ళీ
ఖుషి ఫుల్ రన్ మొదటి రోజు రికార్డు ని చాలా ఈజీగా బద్దలు కొట్టింది
సూపర్ స్టార్ మహేష్ బాబు 'బిజినెస్ మెన్' చిత్రం. ఇలా
సూపర్ స్టార్ మహేష్ ఒక రికార్డు క్రియేట్ చేస్తే
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ బ్రేక్ చేస్తున్నాడు, పవన్ రికార్డు క్రియేట్ చేస్తే దాన్ని మహేష్ బ్రేక్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికీ ఈ టాప్ 2 స్టార్స్ తమ స్టార్ స్టేటస్ ని ఇంకా నిరూపించుకుంటున్నారు.