ఆ విషయంలో సూపర్ స్టార్ ని క్రాస్ చేసిన మాస్ మహారాజ్...!!
దసరా సందర్భం గా అక్టోబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్ లో నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఇతర సినిమాల న్నింటినీ వెనక్కి నెట్టి ఈ సినిమా టాప్ వన్ ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం. టైగర్ నాగేశ్వర్ రావు సినిమా తర్వాత రవితేజ ఈగల్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అంటే ఫ్యాన్ ఇండియాలో రిలీజ్ కానుంది.