ఫస్ట్ శాలరీతో కొన్న కారులో నాన్న శవాన్ని తీసుకొనివచ్చాము :: రీతూ చౌదరి
ఫస్ట్ శాలరీతో కొన్న కారు లో నాన్న శవాన్ని తీసుకొనిరావడం జరిగిందని ఆ కారు లో ఎప్పుడు కూర్చున్నా నాన్న నాతో ఉన్నారనే భావన కలిగిందని రీతూ చౌదరి వెల్లడించారు. నాన్న మరణాన్ని అన్నయ్య జీర్ణించుకోలేకపోయాడని రీతూ చౌదరి కామెంట్లు చేశారు. కుటుంబ బాధ్యతలను తీసుకుంటానని చెబుతూ నాన్న శవంపై నేను ప్రామిస్ చేశానని రీతూ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. రీతూ చౌదరికి ఇన్ స్టాగ్రామ్ లో 9,92,000 ఫాలోవర్లు ఉన్నారు. త్వరలో 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీల జాబితాలో రీతూ చౌదరి చేరే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రీతూ చౌదరి సినిమాలపై దృష్టి పెడితే ఆమె కెరీర్ మరింత పుంజుకుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రీతూ కెరీర్ ను రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.