ఆమూవీ అయినా వారిద్దరి దశను మార్చబోతోందా ?

Seetha Sailaja

గత శుక్రువారం విడుదలైన ‘మంగళవారం’ టోటల్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈమూవీ దర్శకుడు అజయ్ భూపతి గురించి మళ్ళీ టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ సర్కిల్ మాట్లాడుకుంటోంది. ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ   సంచలన విజయంతో అందరి ప్రశంసలు పొందిన అజయ్ భూపతి తన ద్వితీయ ప్రయత్నంగా తీసిన ‘మహాసముద్రం’ ఫ్లాప్ కావడంతో ఇతడి నుంచి వచ్చిన ‘మంగళవారం’ ఎంతవరకు మెప్పిస్తుంది అన్న సందేహాలకు దర్శకుడు అజయ్ భూపతి గట్టి సమాధానమే ఇచ్చాడు.



‘మంగళవారం’ మూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు సగటు ప్రేక్షకుడి ఆమోదం కూడ లభించడంతో దసరా దీపావళి సినిమాలు అందుకోలేని సక్సస్ టాక్ ను ‘మంగళవారం’ తెచ్చుకుంది. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేని ఒక పాయింట్ తో కూడుకున్న కథ కావడంతో ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చింది.



ఈసినిమాకు సంబంధించి కీలకంఅయిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు  ప్రేక్షకులకు  బాగా  నచ్చడం  తో   ఈమూవీ పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈసినిమాకు సంబంధించిన కీలకంఅయిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో ఎవరో ఒకరు టాప్ హీరో ఈమూవీలో ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈమూవీలో లీడ్ పాత్రలో నటించిన పాయాల రాజ్ పుత్ నటనకు విమర్శకుల నుండి కూడ విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి.

 

‘ఆర్ఎక్స్ 100’ ఆమె చాల బొల్డ్ సీన్స్ విషయంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా నటించిన ఈమూవీలో కూడ నెగిటివ్ షేడ్స్ లేనప్పటికీ ఆమె పాత్ర పట్ల చాలామంది జాలి కనపరుస్తున్నట్లు టాక్. అయితే ‘ఆర్ ఎక్స్ 100’ లో పాయల్ పాత్ర పట్ల తెలుగు ప్రేక్షకులు ఆమె పై ద్వేషాన్ని పెంచుకుంటే లేటెస్ట్ గా విడుదలైన ‘మంగళవారం’ మూవీలోని శైలు పాత్రను చూసిన ప్రేక్షకులు మాత్రం పాయల్ పై సానుభతి వ్యక్త-అరుస్తున్న నేపద్యంలో అటు పాయల్ కు ఇటు అజయ్ కు కొన్ని సంవత్సరాల తరువాత దశ తిరిగింద అంటూ కొందరరి  కామెంట్స్..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: