తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన
యువ నటుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న
పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా
ఆది కేశవ అనే సినిమాలో హీరోగా నటించాడు.
శ్రీకాంత్ ఎన్
రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత సూర్య దేవర
నాగ వంశీ నిర్మించాడు. ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని
శ్రీ లీల
హీరోయిన్ గా నటించగా ... జీవి ప్రకాష్
కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ
మూవీ ని
నవంబర్ 24 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా యొక్క ట్రైలర్ లాంచ్
ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా యొక్క ట్రైలర్ ను లాంచ్ ను
ఈవెంట్ ను
నవంబర్ 20 వ తేదీన సాయంత్రం 4 గంటలకు "ఏ ఎం బి"
సినిమా స్క్రీన్ 1
హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఉప్పెన
మూవీ తో అద్భుతమైన విజయం అందుకున్న వైష్ణవ్ ఆ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా సినిమాలతో వరుసగా అపజాయలను
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. మరి ఆదికేశవ
మూవీ తో ఏ స్థాయి విజయాన్ని ఈ
యువ నటుడు సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.