'సలార్' ట్రైలర్ గురించి అదిరిపోయే అప్డేట్..!!

Anilkumar
'కేజీఎఫ్' మూవీతో దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో సలార్ ఒకటి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలున్నా అందరి దృష్టి 'సలార్' పైనే ఉంది. ఆ రేంజ్ లో ఈ మూవీ ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ చేసిన సలార్ టీజర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 


కేవలం 24 గంటల్లోనే సలార్ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇక డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి నీల్ 'సలార్' ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. లిఖిత రెడ్డి నీల్ తన ఇన్ స్టాగ్రామ్ లో సలార్ ట్రైలర్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో.." రవి బస్రూర్ మ్యూజిక్ అండ్ మూవీ స్టూడియో నుంచి తీసింది. 


అందులో సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ కట్ ప్రాసెస్ లో ఉంది" అని లిఖితారెడ్డి రాసుకొచ్చింది. దీంతో ఆ పిక్ కాస్త సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. సలార్ ట్రైలర్ కట్ పనులు జరుగుతున్నాయని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 1 రాత్రి 7:19 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. దాదాపు రెండున్నర నుంచి మూడు నిమిషాల నిడివితో ఈ ట్రైలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సలార్ మూవీలో 'కేజిఎఫ్' హీరో యశ్ క్యామియో రోల్ చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: