సూపర్ స్టార్ స్టార్ రజనీకాంత్ తన 171వ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లొకేష్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మూవీ టీం వారు బిజీగా ఉన్నారు.రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం అనగా 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానుంది.ఈ లోగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన 170వ చిత్రం పూర్తి చేసి బయటకొచ్చేయాలి. అందుకు తగ్గట్టే ప్రణాళిక కూడా సాగుతోంది. అయితే లోకేష్ సూపర్ స్టార్ తో ఓ రీమేక్ సినిమాని తెరకెక్కిస్తున్నాడని ఈ మధ్య సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.రజనీ ఇమేజ్ కి తగ్గట్టు ఆ కథని పూర్తిగా లోకేష్ తన స్టైల్ లోకి మార్పు చేసి కొత్త కథని సిద్దం చేసారని సమాచారం వినిపిస్తుంది. ఆ స్టోరీ సూపర్ స్టార్ కి చాలా నచ్చిందని కోలీవుడ్ లో ఠారెత్తిపోతుంది.అయితే తాజాగా ఈ కథనాల్ని డైరెక్టర్ లొకేష్ కొట్టిపారేసాడు. అసలు తాను ఏ సినిమాని రీమేక్ చేయలేదని..తన సొంత కథతోనే 171వ తెరకెక్కుతుందని ఆయన వివరణ ఇచ్చారు.
వచ్చే వారం నుంచి సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా మొదలవుతాయి.ఈ సినిమా లోకేష్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ అని విక్రమ్ కి మించి ఉంటుందని సమాచారం తెలుస్తుంది. రజనీ లాంటి నటుడుకి లోకేష్ లాంటి సూపర్ డైరెక్టర్ తోడైతే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. లొకేష్ యూనివర్శ్ నుంచి రిలీజ్ అయిన సినిమాలంటే మార్కెట్ లో ఓబ్రాండ్. అలాంటి బ్రాండ్ కి సూపర్ స్టార్ కూడా తోడైతే అంచనాలు తారా స్థాయిలోనే ఉంటాయి.ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ తో భారీ యాక్షన్ హిట్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత రజనీ కెరీర్ లో పడిన పెద్ద బ్లాక్ బస్టర్ ఇది. ఇక లోకష్ ఖైదీ..విక్రమ్ ..లియో విజయాలతో అయితే పుల్ ఫాంలో ఉన్నాడు.ఈ నేపథ్యంలో 171పై కూడా అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రస్తుతం రజనీ నటిస్తోన్న 170వ సినిమాని టి.జె జ్ఞాన్ వేల్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈవెంట్ కి రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.