ఆ స్టార్ హీరోయిన్ తో అడివి శేష్ రొమాన్స్!

Anilkumar
అడవి శేష్ హీరోగా 2018 లో వచ్చిన 'గూడచారి'  మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడవి శేష్ కి జోడిగా శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మధుశాలిని, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో అడివి శేష్ నటన, కథలోని ట్విస్టులు ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేశాయి.. అంతేకాదు 2018 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 


ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'గూడచారి 2'మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వినయ్ కుమార్ దర్శకుడుగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నాడు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.


 'గూడచారి 2' లో హీరోయిన్ గా బనితా సంధు  నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'వెల్కమ్ టు ద మిషన్ బనితా సంధు' అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక హీరోయిన్ బనిత సందు విషయానికొస్తే.. బాలీవుడ్లో 'అక్టోబర్'మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ ఆదిత్య వర్మ లో చియాన్ విక్రమ్ కొడుకుతో కలిసి నటించింది. బాలీవుడ్, సౌత్ సినిమాలతో పాటుగా హాలీవుడ్ లో 'ఎటర్నల్ బ్యూటీ', 'మదర్ తెరిసా అండ్ మీ' అనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: