పుట్టినరోజు సందర్భంగా చిందులతో చిందేసిన ఏపీ మంత్రి రోజ...!!
దీనికి సంబంధించిన ఫోటోలను రోజా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో అభిమానులు బర్తడే విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. య బర్త్డే వేడుకల్లో మంత్రి రోజా వేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రోజా తన కుమారుడు లోహిత్ శల్వమణితో కలిసి ముక్కాల ముక్కబుల పాటకు ఆనందంగా చిందులేసారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల లోడింగ్ అంటూ పాటకు స్టెప్పులేసి బర్తడే పార్టీలో సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ tollywood ని ఏలేశారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడం, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ఈమె అసలు పేరు శ్రీలత రెడ్డి. ఈమె నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2022లో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం సాంస్కృతిక యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక క్రీడలు యువజన మంత్రిగా నియమితులయ్యారు. మంత్రి అయినందుకు ఇక మీదట టీవీ సినిమా షూటింగ్ లు చేయనని ఆమె ప్రకటించారు.