చరణ్ డెడ్ లైన్ ను శంకర్ పట్టించుకుంటాడా ?

Seetha Sailaja
ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం తరువాత రామ్ చరణ్ స్పీడ్ కు అతడి నుంచి చాల సినిమాలు వస్తాయని అభిమానులు ఆశించారు. అయితే శంకర్ చరణ్ ల కాంబినేషన్ లో మొదలైన ‘గేమ్ ఛేంజర్’ మొదలైన నాటి నుండి రకరకాల కారణాలతో ఆ సినిమా పూర్తి అవ్వడం ఆలస్యం అవుతూ ఉండటంతో చరణ్ సినిమాల ప్లాన్స్ అన్నీ తలక్రిందలు అయ్యాయి.


దర్శకుడు శంకర్ ఈసినిమాను ‘ఇండియన్ 2’ తో సమాంతరంగా తీయాలని భావించడంతో ‘గేమ్ ఛేంజర్’ ఎప్పుడు పూర్తి అవుతుందో అటు చరణ్ కు ఇటు నిర్మాత దిల్ రాజ్ కు తెలియని పరిస్థితి అని అంటున్నారు. తిరిగి పట్టాలెక్కించి రెండు సినిమాలను సమాతరంగా షూట్ చేయాలని అనుకున్నాడో అప్పట్నుంచే ‘గేమ్ చేంజర్’ కు బ్రేక్ పడిపోయింది.


ప్రస్తుతం శంకర్ దృష్టంతా ‘ఇండియన్ 2’ పైనే నడుస్తోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోనూ సమ్మర్ రేస్ లో విడుదల చేయాలి అన్న పట్టుదల శంకర్ కు ఉండటంతో ఇప్పుడు శంకర్ దృష్టి అంతా ‘ఇండియన్ 2’ పైనే ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఈవిషయమై ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ కు అదేవిధంగా రామ్ చరణ్ కు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి రామ్ చరణ్ ఈసినిమాను వేగంగా పూర్తిచేసి బుచ్చిబాబు దర్శకత్వంలో మొదలుపెట్టవలసిన సినిమా పై దృష్టి పెట్టాలని చరణ్ భావిస్తున్న నేపధ్యంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ నుండి త్వరలో బయటపడాలి అన్న ఉద్దేశ్యంతో ఈమధ్య దర్శకుడు శంకర్ ను తన వద్దకు పిలిపించుకుని తన మూవీని ఎట్టిపరిస్థితులలోనూ రాబోతున్న వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లోపు పూర్తిచేయాలి అన్న డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ ఆ డెడ్ లైన్ ఎంత వరకు శంకర్ సీరియస్ గా తీసుకుంటాడు అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి అనికోవాలి.. ..    





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: