హమ్మయ్యా.. అడవి శేష్ కీ హీరోయిన్ దొరికేంసింది?
అందుకే ఎవరైనా డైరెక్టర్ ఇలా క్రైమ్ త్రిల్లర్ సినిమాలను హ్యాండిల్ చేయాలి అంటే ఆ కథను ఎంతో బాగా హ్యాండిల్ చేసే అనుభవం ఉండాలి. అయితే కొంతమంది దర్శకులు ఏకంగా క్రైమ్ ట్రేలర్ కథాంశంతో.. తమ టేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో దర్శకుడు శశికిరణ్ తిక్క కూడా ఒకరు. ఈయన గూడచారి సినిమా తీసి తెలుగు ప్రేక్షకులనందరిని మెప్పించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోనూ అడవి శేషు కీలక పాత్రలో నటిస్తూ ఉన్నాడు.
అయితే ఈ సినిమాలో అడవిశేష్ సరసన అటు హీరోయిన్గా నటించబోయేది ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ విషయం గురించి గత కొంత సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.. అయితే ఇటీవల ఈ విషయంపై ఏకంగా ఈ సినిమా కోసం సెలెక్ట్ అయిన హీరోయిన్ స్పందించింది. ఓ గొప్ప ప్రాజెక్టుతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేయని పాత్ర ఇది. ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఇస్తుంది అంటూ బాలీవుడ్ హీరోయిన్ బానిట సందుని ఒక ఆసక్తికర పోస్టు పెట్టగా.. ఆమె గూడాచారి సినిమాలో నటిస్తుంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. కాగా ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్, ఆర్ట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.